కోరిక తీర్చితేనే ఇందిరమ్మ ఇల్లు.. ఒంటరి మహిళకు కాంగ్రెస్ నేత వేధింపులు
సాయం చేయమని వెళ్లిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు కన్నేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని అడిగితే తన కోరిక తీర్చాలని వేధించాడు. వేధింపులు పెరిగి పోతుండటంతో భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు నాయకుడిపై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకున్నది.
- న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
కామారెడ్డి, మే 19 : సాయం చేయమని వెళ్లిన మహిళపై కాంగ్రెస్ నాయకుడు కన్నేశాడు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని అడిగితే తన కోరిక తీర్చాలని వేధించాడు. వేధింపులు పెరిగి పోతుండటంతో భరించలేని బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో సదరు నాయకుడిపై కేసు నమోదైన ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ ఇందిరమ్మ ఇల్లు కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిని సంప్రదించింది.
దీంతో ఇల్లు మంజూరు చేయించాలంటే తన కో రిక తీర్చాలని షరతు పెట్టాడు. ఈ వేధింపులు తట్టుకోలేకపోయి బాధితురాలు రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాధు చేసింది. సదరు నాయకుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వచ్చిన కాంగ్రెస్ నేత బెస్త చంద్రంను అధికార పార్టీ సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే ఎవరైనా సహించేది లేదని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కృష్ణారావు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

