హుజూరాబాద్ టౌన్, మార్చి 3 : కాంగ్రెస్ దోఖాబాజ్ పార్టీ అని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రెండో విడుత ప్రజాహిత యాత్రలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంతోపాటు హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలకు కోతలు పెడుతూ ప్రజలను మోసగిస్తున్నదని మండిపడ్డారు.
మరో పది రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని, అప్పుడు మళ్లీ ఓటేస్తే ఆరు గ్యారెంటీలు ఇస్తామని డ్రామాలు చేస్తారని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ ప్రభు త్వం ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేని పరిస్థితి లో ఉన్నదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలం టే రూ.5లక్షల కోట్లు అవసరమని, ఆ నిధు లు ఎకడినుంచి తెస్తారో రేవంత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.