Dasarathi Krishnamacharya | జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా తెలంగాణ.. కోటి రతణాల వీణ’ అని గర్జించిన తెలంగాణ వైతాళికుడు, మహాకవి దాశరథి కృష్ణమా చార్యులును రేవంత్ రెడ్డి సర్కారు విస్మరిస్తున్నది. దాశరథి జయంతి సందర్భంగానైనా నిజామాబాద్‌లోని ఆయన స్మృతి చిహ్నాల పునరుద్ధరణను అసలే మురిచింది.
సమైక్య రా ష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి.. తెలంగాణకు వన్నె తెచ్చిన దాశరథి విగ్రహాలకు జీవం పోయాలన్న శ్రద్ధ లేకుండాపోయింది. అడుగడు గునా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బాహాటం గానే అడ్డుకున్న రోశయ్య విగ్రహాన్ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పాల కులు ఆవిష్కరించారు. దాశరథి కృష్ణమాచా ర్యులు గొప్పతనాన్ని గుర్తించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఆయన విగ్రహాన్ని ఇందూరు పురా తన జైలులో ఏర్పాటు చేసేందుకు చొరవ తీసు కున్నది. విగ్రహావిష్కరణ సమయానికి ఎన్ని కలు రావడం, ఎన్నికల కోడ్ అమల్లోకి రావ డంతో వాయిదా పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఖిల్లా జైలును పునరుద్ధ రణ చేయకుండా చేతులెత్తేసింది. పునరుద్ధరణ పనులు పూర్తయినా, ప్రారంభోత్సవానికి నోచ డంలేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో నాడు రూ.40 లక్షల వ్యయంతో రూపుదిద్దిన ఆధునికీకరణ పనులు, దాశరథి కృష్ణమాచా ర్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి విగ్రహాలు నేడు కళావిహీనంగా మారా యి. ఆగస్టు 24న దాశరథి జయంతి నాటికైనా విగ్రహాలను ఆవి ష్కరించి, మరింతగా అభివృద్ధి చేయాలని పలు వురు కోరుతున్నారు.
చారిత్రక విశేషాలకు కేంద్ర బిందువు
చారిత్రక ఖిల్లా ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయనుకుంటే అది కలగానే మిగిలింది. ఖిల్లా జైలును వేరే చోటుకు మార్చిన తర్వాత పడావుగా ఉన్న పురాతన జైలును బీఆర్ఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. చారిత్రక విశే షాలకు కేంద్ర బిందువైన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ముందు కొచ్చింది. పాత ఖిల్లా జైలును ఆధునికీకరించి ప్రజల సందర్శనకు ఏర్పాట్లు చేసింది. దాశ రథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి ఒకే సమయంలో ఒకే బ్యారక్ ఖిల్లా జైలులోనే శిక్షను అనుభవించారు. జైలు గో డల మధ్య ఆ ఇద్దరు మహానుభావులు ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. ఇదే సమ యంలో తమ నైపుణ్యానికి పదునుపెట్టి అనేక రచనలకు పూనుకున్నారు. తనను బంధించిన బ్యారక్ గోడలపై పెన్నూ, పేపర్ లేకపోయినా, బొగ్గు ముక్కతో ‘నా తెలంగాణ… కోటి రతనాల వీణ’ అంటూ దాశరథి రాసిన నినాదం కోటి మెదళ్లను తాకింది. అదే బ్యాంక్‌లో ఇప్పుడు విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. పక్కనే వట్టికోటతోపాటు నలుగురు జైలు సిబ్బంది ఉన్నట్టు ఒక సాధారణ సన్నివేశాన్ని కండ్లకుకట్టే విధంగా విగ్రహాల కూర్పు చేస్తు న్నారు. సందర్శకులంతా పుష్పాంజలి ఘటించేందుకు గాను జైలు ప్రాంగణంలోనే దాశరథి కృష్ణమాచార్యులు కాంస్య విగ్రహాన్ని సైతం నెలకొల్పుతున్నారు. జైలు గదు ల్లో విగ్రహాల సందర్శనకు, వెలుపల ఏర్పాటుచేసే కాంస్య విగ్రహం నివాళులు అర్పించేందుకు వేర్వే రుగా ప్రతిష్ఠిస్తున్నారు.
ఇందూరు చరిత్రపై సర్కారు చిన్నచూపు
నిజాం వ్యతిరేక పోరాటంలో భాగంగా దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆళ్వారు స్వామి 1948లో నిజామాబాద్ జైలులో శిక్షను అనుభవించారు. 1949లో దాశరథి రచించిన అగ్నిధార కావ్యాన్ని ప్రచురించగా, ఇందులో కనీసం సగం కవితలు ఈ జైలులో రాసినవే. వట్టికోట ఆళ్వారుస్వామి 1955లో ప్రచురించిన ప్రజల మనిషి నవలలో హీరో కంఠీరవం జైలు జీవితం తెలియజెప్పిన ఒక అధ్యాయం ఇక్కడి అనుభవాలే. వట్టికోట రాసిన జైలు లోపలి కథలు అనే కావ్య సంపు టిలోనూ ఆయన స్వీయ జైలు అనుభవాలు ఉన్నాయి. దాశరథి కృష్ణమాచార్యులు రచిం చిన అగ్నిధార 1963లో మలి ముద్రణ జరి గింది. 1948లో జనవరి 30న మహాత్మా గాంధీ మరణించినప్పుడు క్షమామూర్తి అనే సంస్మరణ పద్యాన్ని ఇదే జైలులోనే దాశరథి రాయడం విశేషం. అంతటి చరిత్ర కలిగిన ఈ ప్రాంతంపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తున్నది.