హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : మహిళా శక్తి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్బాటంగా ప్రకటించినా అచరణలో మాత్రం పైసా ఇవ్వడంలేదు. వడ్డీ లేని రుణాల మొత్తాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేస్తామని, అదే సమయంలో గతంలో ఇవ్వాల్సిన మొత్తానికి తమకు సంబంధంలేదంటూ చేతులు ఎత్తేశారని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. బ్యాంకులు ఇచ్చే రుణాలకే, గతంలో ఉన్న బ్యాంక్ లింకేజీ పథకానికే మహిళా శక్తి పేరు తగిలించుకొని ప్రచారం చేసుకుంటున్నదని మహిళా సంఘాలు విమర్శిస్తున్నాయి. మహిళా శక్తి కార్యక్రమంలో క్యాంటీన్లు సహా ఇతర ఆహార, ప్రజలకు సర్వీస్ అందించే వాటిని మొత్తం రకరకాల వ్యాపారాలను నెలకొల్పాలని సూచించారు. కానీ వాటికి ప్రభుత్వం నుంచి పైసా సాయం ఇంతవరకూ అందలేదు. ప్రభుత్వ సబ్సిడీ లేకుండా ఎలా వ్యాపారాలు చేయాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. వడ్డీతో పాటు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు.
రూ.500 కోట్ల బకాయిలు..
బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల రీపేమెంట్లో అసలుతోపాటు వడ్డీని మహిళా సంఘాలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తరువాత వడ్డీని ప్రభుత్వం విడుదల చేస్తుంది. కానీ, మార్చిలో ఇచ్చిన రుణాలకు వీఎల్ఆర్ ఉసెత్తడంలేదని, దీంతో సంఘాలకు రూ. 500 కోట్ల బకాయి ఉందని చెబుతున్నారు.