ఖమ్మం సిటీ, మార్చి 22: కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కమీషన్లు వచ్చే శాఖలకే నిధులు కేటాయించిందని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
కాగ్, బీజేపీ సర్కార్ పార్లమెంట్ సాక్షిగా ఒక లెక్క చెబితే.. బూతులరెడ్డి మాత్రం మరో విధంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రూ. 8 లక్షల కోట్లు అప్పు చేశారని, వాటిని తీర్చడానికే తమకు డబ్బులు సరిపోవడం లేదని రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల అధికారంలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని కేంద్రమే చెబుతున్నదని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ తెచ్చిన అప్పుతో ప్రజల ఆర్థిక స్థో మతను పెంచిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండున్నరేండ్లలో రూ. 3.75 లక్షల కోట్లు అప్పు చేసిందని కేంద్ర ఆర్థిక స హాయ మంత్రి ప్రకటించారని తెలిపారు. మరి ఆ అప్పులతో తెలంగాణ ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఎక్కడైతే కాసుల వర్షం కు రుస్తుందో, 10 నుంచి 30శాతం వరకు కమీషన్లు వస్తాయో.. ఆయా రంగాలకే నిధుల కేటాయింపులు జరిగాయని ఆరోపించారు.