జూనియర్ లెక్చరర్లపై సర్కార్ కక్ష!
రాష్ట్రంలో 2023 బ్యాచ్ జూనియర్ లె క్చరర్లకు కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తున్నదన్న విమర్శలున్నాయి. కేసీఆర్ హ యాంలో క్రమబద్ధీకరించిన ఈ లెక్చరర్లపై కక్ష ను ప్రదర్శిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నా యి.
- కాంట్రాక్ట్ లెక్చరర్లను క్రమబద్ధీకరించిన కేసీఆర్
- ఇంక్రిమెంట్లు ఇవ్వలేకపోతున్న రేవంత్ సర్కార్
- ఇబ్బందులు పడుతున్న 2023 బ్యాచ్ అధ్యాపకులు
- కోర్టు చెప్పినా పెడచెవిన పెడ్తున్న అధికారులు
- స్పందించకుంటే ఆందోళనకు సిద్ధమని హెచ్చరిక
హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2023 బ్యాచ్ జూనియర్ లె క్చరర్లకు కాంగ్రెస్ సర్కార్ తీరని అన్యాయం చేస్తున్నదన్న విమర్శలున్నాయి. కేసీఆర్ హ యాంలో క్రమబద్ధీకరించిన ఈ లెక్చరర్లపై కక్ష ను ప్రదర్శిస్తున్నదన్న ఆరోపణలు వస్తున్నా యి. జూనియర్ లెక్చరర్లకు న్యాయంగా అం దాల్సిన వార్షిక ఇంక్రిమెంట్లను మంజూరు చే యడం లేదు. ఈ విషయంలో సర్కార్ నిర్లిప్తతను ప్రదర్శిస్తున్నది. కిందిస్థాయి అధికారుల కు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంలేదు. ఫలితం గా వేలాది మంది లెక్చరర్లు 2వ, 3వ ఇంక్రిమెంట్‌కు నోచుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,100 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లను కేసీఆర్ సర్కార్ క్రమబద్ధీకరించింది. వీరికి ఏడాది కాగానే 2024 మే 4న మొదటి వార్షిక ఇంక్రిమెంట్ మంజూరయ్యింది. అయితే 2025లో రావాల్సిన రెండో ఇంక్రిమెంట్ ఇవ్వలేదు. 2026లో మేలో అందాల్సిన మూడో ఇంక్రిమెంట్‌నూ అధికారులు మంజూరు చేయలేదు. దీనిపై అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని ఈ ఏడాది మే 2న కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు తీర్పును అనుసరించి 452 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు ఇంక్రిమెంట్లు మంజూరు చేయగా, ఇంటర్ వారి విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తున్నారు. జాప్యాన్ని నిరసిస్తూ హైకోర్టులో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేసినట్టు తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకచంద్రం వెల్లడించారు. అయినా సర్కార్ స్పందించకపోతే ఇంటర్ విద్యా కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి
క్రమబద్ధీకరించిన లెక్చరర్ల ప్రొబేషన్ కా లంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సర్వీస్ రికార్డుల నిర్వహణలో సమస్యలొస్తున్నాయి. లెక్చరర్లు మెడికల్ లీవ్‌లకు నోచుకోలేకపోతున్నారు. ఇంక్రిమెంట్ల విషయంలో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి అన్న ట్టున్నది. జగిత్యాల జిల్లాలో 138 మంది లె క్చరర్లకు 119 మందికి రెండో ఇంక్రిమెంట్ మంజూరయ్యింది. 19 మంది అధ్యాపకుల కు మాత్రం అందలేదు. ఇక సిద్దిపేట జిల్లాలో పనిచేస్తున్న లెక్చరర్లకు రెండో, మూడో వార్షిక ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇంక్రిమెంట్లు ఇచ్చినట్టు లెక్చరర్లు చెప్తున్నారు. సూర్యాపేటలో ఒక కాలేజీ, ములుగులో రెండు కాలేజీల్లో మాత్రమే ఇచ్చినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

