హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనా లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో భవనానికి రూ. 5 కోట్ల చొప్పున మొత్తం రూ. 110 కోట్ల అం చనాతో పరిపాలనా అనుమతులిస్తూ ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసిం ది. మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యా ల, రాజన్నసిరిసిల్ల, హనుమకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, నారాయణపేట, జగిత్యాల, భూపాలపల్లి, వనపర్తి, మెదక్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, గద్వాల జిల్లా ల్లో మహిళాశక్తి భవనాలను నిర్మించనున్నారు. 19న హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించనున్న ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి వీటికి శంకుస్థాపన చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
విజయోత్సవ సభపై మంత్రి సమీక్ష..
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హనుమకొండలో 19న ప్రజాపాలన విజయోత్సవ సభ పై సచివాలయంలోని తన చాంబర్లో ఆదివారం మంత్రి సీతక్క అధికారుల తో సమీక్షించారు. సీఎం పాల్గొంటున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సభలో ప్రకటించే నూతన పథకాల విధివిధానాలు, సభా ప్రాంగణంలో స్టాళ్ల ఏర్పాటుపై చర్చించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితారామచంద్రన్, డైరెక్టర్ క్రాంతి వెస్లీ పాల్గొన్నారు.
‘ఫొటోషూట్ కోసమే కిషన్‌రెడ్డి మూసీ నిద్ర’
హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫొటోషూట్ కోసమే మూసీ నిద్ర చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ ఎద్దేవా చేశారు. ఆయన అక్కడ నిద్రించే ముందు దోమలు, ఈగల మందు కొట్టించారని ఆరోపించారు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 3 నెలలపాటు అక్కడే బస చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో సవాల్ విసిరారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్‌ఫ్రంట్ గురించి గొప్పగా చెప్పిన ఆయన, మూసీ పునరుద్ధరణపై విమర్శలు చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. బీజేపీ అడ్డుకోవాలని చూసినా మూసీ ప్రక్షాళన ఆగదని తేల్చిచెప్పారు.