హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ): జర్నలిస్టులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మండిపడ్డారు.
శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో జర్నలిస్టుల సంక్షేమానికి ఎంతగానో కృషిచేశారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు ఏకంగా 13వేల అక్రెడిటేషన్ కార్డులకు కోత పెట్టేందుకు యత్నిస్తున్నదని, వెంటనే జీవో 252ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.