82% జీవోలు రహస్యం
తమది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు పారదర్శకతకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను గోప్యంగా పెడుతున్నారు. పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన జీవోలను బయటకు రానీయకుం డా రహస్యంగా ఉంచుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం రోజువారీగా జారీచేస్తున్న జీవోల్లో 82% జీవోలు బయటకురావడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.
- కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
- పబ్లిక్ డొమైన్లో కానరాని జీవోలు
- డిసెంబర్ 2023 నుంచి జనవరి 2025 మధ్య జారీ అయిన ఉత్తర్వుల్లో అత్యధికం చీకట్లోనే
- హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తమది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలకులు పారదర్శకతకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులను గోప్యంగా పెడుతున్నారు. పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన జీవోలను బయటకు రానీయకుం డా రహస్యంగా ఉంచుతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం రోజువారీగా జారీచేస్తున్న జీవోల్లో 82% జీవోలు బయటకురావడం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థంచేసుకోవచ్చు.
అధికారిక లెకల ప్రకారమే.. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణం చేసిన 2023 డిసెంబర్ 7 నుంచి 2025 జనవరి 26 మధ్య కాలంలో మొత్తం 19,064 జీవోలను ప్రభు త్వం జారీచేసింది. ఇందులో 3,290 జీవోలను మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచగా, మిగిలిన 82 శాతానికిపైగా (సుమారు 15,774) జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా రహస్యంగా ఉంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (2014 జూన్ నుంచి) 1,99,115 జీవోలు విడుదల కాగా, సుమారు 1,16,458 జీవోలు (దాదాపు 58.5%) ఇప్పటికీ ప్రజల దృష్టికి రాకుండాపోయాయి.
సమాచార హకు చట్టం (ఆర్టీఐ) నిబంధనలకు విరుద్ధంగా, సరైన కారణాలు చూపకుండానే వివిధ శాఖలు జీవోలను పబ్లిక్ డొమైన్లో లేదా ఇంటర్నెట్లో పెట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్‌తో పోలిస్తే, తెలంగాణలో జీవోల ప్రచురణ తీరు చాలా వెనుకబడి ఉన్నది. ఏపీ పోర్టల్‌లో లక్షలాది ఉత్తర్వులు అందుబాటులో ఉండ గా, తెలంగాణలో మాత్రం అత్యధిక జీవోలను అంతర్గత ఉత్తర్వుల పేరుతో దాచిపెడుతున్నారు. హైకోర్టు గతంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరులో ఎలాంటి మార్పు రావడం లేదు. జీవోలను పబ్లిక్ డొమైన్లో పెట్టకపోవడంపై ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతున్నదని హైకోర్టును ఆశ్రయించిన సామాజిక కార్యకర్త బీ వినయ్‌రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

