మహబూబ్ నగర్ : కాళేశ్వరం పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తుందని మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి ( Laxmareddy) , శ్రీనివాస్‌గౌడ్ ( Srinivas Goud ) ఆరోపించారు. మేడిగడ్డ (Medigadda) రిపేర్ చేతగాక (Congress failed ) , ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయలేక బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ‘ కాళేశ్వరం పై కాంగ్రెస్ కుట్రలు- కమిషన్ వక్రీకరణలు – వాస్తవాలు’ అనే అంశం పై మాజీ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాజీ మంత్రులు డా.సి.లక్ష్మారెడ్డి ,శ్రీనివాస్ గౌడ్ ,నాయకులు తిలకించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.మేడిగడ్డను రిపేర్ చేయకుండా కాళేశ్వరం కమిషన్ నివేదిక పేరుతో కాలయాపన చేస్తుందని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజలందరికీ క్లారిటీ వచ్చింది.హరీష్ రావు చెప్పినదాన్ని ప్రజల్లో చర్చ పెట్టాలి.కాళేశ్వరం కమిషన్ కాదు. కాంగ్రెస్ కమిషన్.కాంగ్రెస్ డ్రామాలు ప్రజలు అర్ధం చేసుకోవాలి.తెలంగాణ లో ప్రాజెక్టులు కట్టినట్టు చేయాలి. నీళ్ళు కిందికి పంపించాలి.ఇదే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు చేసిన పని. ఆంధ్రా పాలకుల ఆలోచన ఇదేనని పేర్కొన్నారు.
కేసీఆర్ హయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందించాలని గొప్ప ప్రాజెక్ట్‌ను డిజైన్ చేసి నిర్మాణం పూర్తి చేసిందన్నారు. కాళేశ్వరం తో రైతులకు మేలు జరిగిందని వెల్లడించారు.కాంగ్రెస్ గత 20 నెలలుగా హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. కాళేశ్వరం గొప్పతనం తెలంగాణ కు చెప్పడానికి కాంగ్రెస్ మరో అవకాశం ఇచ్చిందని వివరించారు. మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేస్తుందని, ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్తారని వారు తెలిపారు.