Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Ponnam Prabhakar | సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
Ponnam Prabhakar | సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మెరుపు ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అయితే ప్రత్యేక రైళ్ల కేటాయింపునకు దక్షిణ మధ్య రైల్వే నిరాకరించడంతో రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.
నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ రైల్వే అధికారులను కోరింది. అయితే దక్షిణ మధ్య రైల్వే నుంచి అనుమతి లభించకపోవడంతో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కాంగ్రెస్ నాయకులు రైల్ నిలయానికి చేరుకున్నారు. రైల్వే జీఎంను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో నేతలు రైల్ నిలయం ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైళ్ల కేటాయింపును అడ్డుకుంటున్నారంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఢిల్లీకి వెళ్లడానికి రైలు ఇవ్వటం లేదంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా
సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని GM కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల ధర్నా
నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు వెళ్లడానికి రైలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
ఆందోళన చేస్తున్న సమయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది, పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీకి వెళ్లడానికి రైలు ఇవ్వటం లేదంటూ కాంగ్రెస్ నాయకుల ధర్నా
సికింద్రాబాద్ రైల్వే నిలయంలోని GM కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకుల ధర్నా
నవంబర్ 1వ తేదీన ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ నిరసనలకు వెళ్లడానికి రైలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించిన కాంగ్రెస్ నాయకులు
— Telugu Scribe (@TeluguScribe) October 28, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponnam Prabhakar | ఢిల్లీ నిరసనలకు ప్రత్యేక రైళ్లు కావాలని కాంగ్రెస్ మెరుపు ధర్నా.. పొన్నం, ఎంపీ రఘురాం రెడ్డికి అస్వస్థత
Husharu 2 | నక్సలైట్ నాయకుడిగా ఆర్. నారాయణమూర్తి.. యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘హుషారు 2’ టీజర్
IAS Transfers | తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జయేశ్ రంజన్, దానకిశోర్ సహా 12 మంది బదిలీ
Upasana Konidela | తాతతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపాసన కొణిదెల!
Sleep | శారీరకంగా అలసిపోయినా కొందరికి నిద్ర పట్టదు.. కారణం ఏమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

