మహబూబ్‌నగర్, జనవరి 2 : ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకొంటున్న పార్టీకి చెందిన కౌన్సిలర్లు కానిస్టేబుళ్లపై దౌర్జన్యంగా వ్యవహరించిన ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకుడు ఫైజల్ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి బర్త్‌డేను పురస్కరించుకుని బ్యానర్ ఏర్పాటు చేశాడు. దీంతో స్థానిక కౌన్సిలర్లు రషీద్‌ఖాన్, ఖాజాపాషాతోపాటు మోసిన్‌ఖాన్ వచ్చి బ్యానర్‌ను తొలగించి ఫైజల్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న కానిస్టేబుళ్లు సుదర్శన్‌రెడ్డి, శ్రీను అడ్డుకునే యత్నంచేశారు. అయినా వినకపోవడంతో వారు మొబైల్ ఫోన్లో వీడియో తీశారు. దీంతో కౌన్సిలర్లు కానిస్టేబుళ్ల ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. గురువారం దీనిపై కానిస్టేబుళ్లు సీఐకి ఫిర్యాదు చేశారు.