సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో యూరియా(Urea) కొరతకు మీరంటే మీరే కారణమని కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటి ధర్నాలు చేశారు. మొదట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూరియా కొరతకు బీజేపీ పార్టీనే కారణమని కొత్త బస్టాండ్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. రాష్టానికి సరిపడా యూరియా అందించాలని కోరారు.
అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి బీజేపీ నాయకులు ర్యాలీగా కొత్త బస్టాండ్‌కు వెళ్లి ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ నాయకులకు తీవ్ర వాగ్వి వాదం జరిగింది. తోపులటలో బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గురాల లక్ష్మా రెడ్డి, కార్యకర్త రఘుకు గాయాలయ్యాయి. తీవ్ర ఉద్రిక్తత నడుమ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను తగులబెట్టారు.