టేకుమట్ల, మార్చి 1: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలకేంద్రంలో బీఆర్ఎస్ నాయకులపై బుధవారం కాంగ్రెస్ నాయకులు జెండా కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సట్ల రవి, సోమనపల్లి సర్పంచ్ ఉద్దమారి మహేశ్, సంగి రవి, మంద చిన్నరవి, అక్రంకు గాయాలయ్యాయి.
పోలీసులు సర్దిచెప్పినా వినకుండా గొడవకు దిగి ఒక్కసారిగా బీఆర్ఎస్ నాయకులపై జెండా కర్రలతో కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. పోలీసులను సైతం నెట్టి వేస్తూ హంగమా సృష్టించారు. దీంతో వారాంతపు సంతకు వచ్చిన ప్రజలు, వ్యాపారులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న చిట్యాల సీఐ పులి వెంకట్‌గౌడ్ ఇరువర్గాలను చెదరగొట్టి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.