బయ్యారం, సెప్టెంబర్ 26: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, కస్తూరినగర్ మాజీ సర్పంచ్ కృష్ణకుమారి భర్త మురళీకృష్ణ ఇంటిపై బుధవారం రాత్రి కాంగ్రెస్ గూండాలు దాడికి య త్నించారు. మండల కేంద్రంలోని సీఎంసీ స్థ లం ఆక్రమణ విషయమై బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన తెలుపగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ గంధంపల్లి సెంటర్లో ఆందోళన చేపట్టడంతో బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మురళీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి Praveen Naik అనుచరులు మురళీకృష్ణ ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించారు. నీ భర్తను చంపుతామంటూ భార్య కృష్ణకుమారిని బెదిరించారు. ఇంతలో మురళీకృష్ణతోపాటు బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. 100కు కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. తన భర్త మురళీకృష్ణకు కాంగ్రెస్ నాయకుడు ప్రవీణ్నాయక్, అనుచరు లు గోవర్ధన్, మదన్, రాంబాబు, పుల్లయ్యతో ప్రాణహానీ ఉందని కృషకుమారి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాత గణేశ్, పలువురు నాయకులతో కలిసి ఎస్పీ రాంనాథ్ కేకన్, డీఎస్పీ తిరుపతిరావుకు ఫిర్యాదు చేశారు.