హైదరాబాద్, నవంబర్ 27 (నమసే ్తతెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఏఐఎఫ్డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ విమర్శించారు. మహిళల హకులు, గౌరవాలు పకన పెట్టి పాలన సాగిస్తుందని మండిపడ్డారు.
గురువారం ఓంకార్భవన్లో జరిగిన ఏఐఎఫ్డీడబ్ల్యూ రాష్ట్ర సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం పేరు చెప్పి గద్దెనెకిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను రెండు వర్గాలుగా విభజించిందని ధ్వజమెత్తారు. మహిళా శక్తి పథకం కింద వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీలో అన్యాయం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఉంటే.. కేవలం 3,57,098 సంఘాలకే వడ్డీలేని రుణాలు ఇచ్చిందని పేర్కొన్నారు.