సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆలిండియా 20వ ర్యాంక్ సాధించిన శ్రీజను బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం బుధవారం తన చాంబర్లో అభినందించారు. మొదటి ప్రయత్నంలోనే శ్రీజ జాతీయ స్థాయి ర్యాంకు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అదనపు కార్యదర్శి, బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ నామోజు బాలాచారి తదితరులు పాల్గొన్నారు. – హైదరాబాద్