హైదరాబాద్, అక్టోబర్18 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ నేటి వరకు మొత్తంగా 103 మంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలను అందజేశారు. బుధవారం గంగుల కమలాకర్, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీ లక్ష్మారెడ్డి, చల్మెడ లక్ష్మీనర్సింహారావు, సుంకె రవిశంకర్, మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఫారాలను అందుకున్నారు.