హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): గురుకులాల పనివేళలు, వాటి ప్రభావంపై చర్చించేందుకు టీఎస్ యూటీఎఫ్ సోమవారం సద స్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆదివారంప్రకటనలో పే ర్కొన్నారు. సవరించిన పనివేళలు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేసేవిధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దోమలగూడ గగన్‌మహల్‌లోని సంఘ కార్యాలయంలో సదస్సు ప్రారంభమవుతుందన్నారు.
మంకీపాక్స్ నిర్ధారణకు ఆర్టీపీసీఆర్ కిట్
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : కరోనా సమయంలో దేశీయ ఉత్పత్తులు అందించిన ఏపీలోని విశాఖ మెడ్ జోన్ తాజాగా మంకీపాక్స్ నిర్ధారణకు దేశీయంగా తయారైన తొలి మంకీపాక్స్ ఆర్టీ-పీసీఆర్ కిట్ ఉత్పత్తి చేసింది. మెడ్ జోన్ భాగస్వామి ట్రాన్సాసియా డయాగ్నోస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ .. ఎర్బామ్ డీఎక్స్ మంకీ పాక్స్ కేకే ఆర్టీ-పాక్స్ పేరిట కిట్ రూపకల్పన చేసింది. ఈ కిట్ ఐసీఎంఆర్, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నుంచి అత్యవసర అంగీకారం లభించిందని మెడ్ జోన్ సీఈవో జితేంద్రశర్మ పేర్కొన్నారు.
ట్రాన్స్‌కోలో కండీషన్ పదోన్నతులు
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్‌కోలో అన్ని క్యాడర్లలోని ఉద్యోగులకు కండీషన్లపై అడ్హాక్ ప్రమోషన్లను కల్పిస్తూ చైర్మన్, ఎండీ సందీప్‌కుమార్ సుల్తానియా ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకరిని సీఈ నుంచి ఈడీగా, ఆరుగురు ఎస్ఈలను సీఈలుగా, ఎనిమిది మంది డీఈలను ఎస్ఈలుగా, ఇద్దరు ఏడీఈలను డీఈలుగా పలువురికి పదోన్నతులు కల్పించారు.
యూపీఎస్ సరికాదు టీసీపీఎస్‌ఈఏ
హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేంద్రం తెచ్చిన ఏకీకృత పెన్షన్ పథకం(యూపీఎస్) సరికాదని, ఈ విధానం ఉద్యోగులకు తీవ్రనష్టం కలిగిస్తుందని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ అసోసియేషన్(టీసీపీఎస్‌ఈఏ) రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాసర్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల జీవితాలతో కేంద్రప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆదివారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగులను, వారి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.