హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వర్సిటీలు, కాలేజీల్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన సీపీగెట్లో 44 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొదటి విడత వెబ్కౌన్సెలింగ్లో మొత్తం 30,176 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకోగా, శుక్రవారం 22,599 మందికి సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని 287 కాలేజీల్లో 50,254 పీజీ సీట్లుండగా, 22 వేలకు పైగా సీట్లు భర్తీ అయ్యాయి. సీట్లు పొందిన విద్యార్థులు అక్టోబర్ 4లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ టీసీ సమర్పించాలని ఆయన సూచించారు.