హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): మారిస్టు పార్టీ దిగ్గజం, పేద ప్రజల గొంతుక, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికంగా దూరం కావడం వామపక్షాలతోపా టు దేశ క్షేమాన్ని కోరుకునే వారికి తీరని నష్టమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఇటీవల మరణించిన సీతారాం ఏచూరి సంతాపసభను సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఏఐటీయూసీ కా ర్యాలయంలో మంగళవారం నిర్వహించారు. సభలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పలువురు సీపీఐ నేతలు ప్రసంగించారు. సమకాలీన రాజకీయాల్లో సీతారాం ఏచూరి ఆదర్శప్రాయుడని వివరించారు. అంతకుముందు ఏచూరి జీవిత చరిత్ర పుస్తకాన్ని వక్తలు ఆవిషరించారు.
హైడ్రాపై శ్వేతపత్రం ఇవ్వాలి : కూనంనేని
చెరువులు, ప్రభుత్వ భూములపై సర్వే చేపట్టి, ఇందులో పేదలు, పెద్దల నిర్మాణా లు, పట్టాలు ఉన్నవారు ఎంతమంది ఉ న్నారో ఒక శ్వేతపత్రం విడుదలచేయాలని కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైడ్రాతో పేదలు బలికాకుండా చూడాలని కోరారు. ఈ అంశం పై పాలసీని రూపొందించాలన్నారు.