హైదరాబాద్: తెలంగాణ విద్వత్సభ షష్ఠ వార్షిక విద్వత్సమ్మేళనంశని, ఆదివారాల్లో (జూలై 23,24) సిద్ధిపేట జిల్లా వర్గల్‌లోని కంచికామకోటి పీఠపాలిత శ్రీ విద్యాసరస్వతి క్షేత్రంలో వైభవంగా జరిగింది. దాదాపు వందమంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష పండితులు పాల్గొన్న ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చే ఏడాది పండుగలు జరుగనున్న తేదీలను నిర్ణయించినట్లు తెలంగాణ విద్వత్సభ అధ్యక్షుడు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చే 2023 మార్చి 22న సంవత్సరాది, వసంత నవరాత్రోత్సవారంభం, 22న పరశురామ జయంతి, 23న అక్షయతృతీయ, మే 14న హనుమాన్ జయంతి, జూన్ 20న జగన్నాధస్వామి రథయాత్ర, జూలై 3న గురుపౌర్ణమి, 9న సికింద్రాబాద్ మహంకాళి జాతర, ఆగస్టు 25న వరలక్ష్మీవ్రతం, 31న రాఖీ పౌర్ణమి, సెప్టెంబర్ 6న కృష్ణాష్ఠమి, 18న వినాయక చతుర్ధి, అక్టోబర్ 15న దేవీ శరన్నవరాత్రారంభం, 22న దుర్గాష్టమి, బతుకమ్మ పండుగ, 23న విజయదశమి (దసరా పండుగ), నవంబర్ 12న దీపావళి పండుగలు ఉంటాయి. అలాగే, జనవరి 15, 2024న సంక్రాంతి, ఫిబ్రవరి 16న రథసప్తమి, మార్చి 8న మహాశివరాత్రి, 25న హోలీ పండుగలు ఉంటాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 21 తెల్లవారుజామున 5.15 (తెల్లవారితే శనివారం) సార్ద్రత్రికోటి సహిత గంగానది పుష్కరారంభం ఉంటుంది.