KGBV | సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేజీబీవీల్లో చదివే విద్యార్థినుల తల్లిదండ్రులు సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పరీక్షలు సమీపిస్తున్నందున ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పక్షం రోజులు దాటినా చదువులు సాగడం లేదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీ ఎదుట సోమవారం విద్యార్థినులు వినూత్న నిరసన తెలిపారు. ఉపాధ్యాయుల సమ్మెలో ఉండటంతో బోధించే వారు లేక ఇబ్బంది పడుతున్నట్టు దండం పెడుతూ ఆవేదన వ్యక్తంచేశారు.
సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మెలో భాగంగా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.