వేములవాడ, నవంబర్ 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రైల్వే భూ నిర్వాసితులు శనివారం ఆందోళనకు దిగారు. పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో నల్ల మాసులు ధరించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వే భూనిర్వాసితు డు, కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య మాట్లాడుతూ.. రాజన్న ఆలయ అభివృద్ధి కోసమే భూములు ఇచ్చేందుకు తాము ముందుకు వచ్చినట్టు తెలిపారు. రైల్వే లైన్ కోసం ఇప్పటికే శివారు భూములు సేకరించారని, తమ భూముల విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికే పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి సమస్యను విన్నవించిన పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటిసారిగా రాజన్న ఆలయ అభివృద్ధి కోసం వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. కేంద్ర మం త్రి బండి సంజయ్ కూడా తమ సమస్యను పరిషరించేందుకు కృషి చేయాలని కోరారు.