కన్నాయిగూడెం, నవంబర్ 10 : ములుగు జిల్లా కన్నాయిగూడెం మం డలం ఐలాపూర్ షెడ్యూల్డ్ తెగ గ్రామ పంచాయతీలో గ్రామస్థులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం కుల గణన సర్వేను బహిష్క రించారు. సర్వే సిబ్బందికి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య మాట్లాడుతూ.. తమ గ్రామానికి ఎలాంటి కనీస సౌకర్యాలు, తారు రో డ్డు నిర్మించలేదని అన్నారు. గిరి వికాస పథకం ద్వారా బోర్లు వేసినా ఫారెస్టు అనుమతులు లేవని త్రీఫేజ్ కరెంట్ రావడం లేదని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు సర్వేను జరగనివ్వబోమని స్పష్టం చేశారు.