హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): సీఎం గారూ మాకిచ్చిన హామీని మరిచారా? ‘నేను ముఖ్యమంత్రినైతే చాయ్ తాగినంత సమయంలో మీ సమస్యలు తీరుస్తా’ అని ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో మాటిచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచినా కనీసం చాయ్ తాగేంత టైమ్ కూడా మీకు లేదా? అని సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వారు అసెంబ్లీని ముట్టడించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకొని అరెస్టులు చేశారు. పలువురు ఉద్యోగులను ఈడ్చిపడేడంతో కొందరు మ హిళా ఉద్యోగులు సొమ్మసిల్లి పడిపోయా రు. తమను రెగ్యులర్ చేసి, బేసిక్ పే (మినిమమ్ టైమ్ సేల్) ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. ప్రజాభవన్‌కు తమను పిలిచిమరీ డి మాండ్లను నెరవేర్చుతామని రేవంత్‌రెడ్డి నాడు హామీ ఇచ్చారని, అది నెరవేర్చకపోవడంతోనే ఆందోళనకు దిగామని తెలిపారు.
సమగ్ర శిక్షా ఉద్యోగుల డిమాండ్లు
రాష్ట్రవ్యాప్తంగా 19,600 మందికి పైగా సమగ్ర శిక్ష విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారిని వెం టనే రెగ్యులర్ చేసి కనీస వేతన స్కేలు ఇవ్వాలని సంఘం నేతలు డిమాండ్ చే శారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా 5 లక్షల సౌకర్యం కల్పించాలని, పీటీఐలకు మిగతా ఎస్ఎస్ఏ ఉద్యోగుల్లాగా 12 నెలల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ కింద రూ.20 లక్షలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సమ గ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షు డు దుండిగల్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ సౌజన్య, సుమన్, సహదేవ్, సురేందర్, మల్లేశ్, యాదగిరి, షేక్ మహబూబ్ పాషా, రమేశ్, చందూ, రవీందర్, జానకీరాం, మహేందర్, సం ధ్యారాణి, దుర్గం శ్రీను, రాజేందర్, అనితాచారి, మంజుల సావిత్రి పాల్గొన్నారు.