గార్ల, నవంబర్ 12: సమగ్ర ఇంటింటి సర్వేలో వ్యక్తిగత వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుల గణన కోసమే సర్వే చేయాలని సూచించారు. కేం ద్రంలో బీజేపీ మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని, మైనార్టీ నేత లను అణిచివేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు మొండిచేయి చూపిస్తున్నదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఎప్పుడో అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీకే తెలియదని ఎద్దేవా చేశారు.
వారికి ఎక్స్టెన్షన్ ఇవ్వొద్దు ; హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్, నవంబర్12 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదవీ విరమణ పొందిన ఉద్యోగులను తిరిగి విధుల్లో కొనసాగించవద్దని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అసోసియేషన్ నేతలు వినతిపత్రం అందజేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను ఆయా స్థానాల్లోనే యథావిధిగా కొనసాగిస్తుండడం వల్ల సీనియర్ అధికారులు ప్రమోషన్లు పొందలేకపోతున్నారని వాపోయారు.