మన్సూరాబాద్, మార్చి 25: సీఎం కేసీఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో వీడియోలను అప్లోడ్ చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వీరమల్ల రాంనర్సింహా గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎల్బీనగర్లోని రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాంనర్సింహా గౌడ్ మాట్లాడుతూ ఫేస్బుక్లో “చలోఢిల్లీ” https:// www.facebook.com/profile.php?id= 100078177728924 అనే అకౌంట్ ద్వారా సీఎం కేసీఆర్ వీడియోలను అసభ్యకరరీతిలో పోస్ట్ చేశారని తెలిపారు. కేసీఆర్‌ను అవమానించే రీతిలో ఉన్న ఈ వీడియోల వలన తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్న ఈ వీడియోలను ఫేస్బుక్ నుంచి తొలగించాలని, దీనికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.