హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై తెలంగాణకు చెందిన హక్కుల న్యాయ వాది రామారావు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ఉదయనిధి చేసిన ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’ అనే వ్యా ఖ్యలపై బుధవారం రాష్ట్రపతి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన పే ర్కొన్నారు.
ఆయన వ్యాఖ్యలు హిందువుల మత విశ్వాసాలను అవమానించే విధంగా ఉన్నాయని, మీడియా, డిజిటల్ వేదికల్లో ప్రసారం కాకుండా చర్య లు తీసుకోవాలని లాయర్ రామారావు రాష్ట్రపతిని అభ్యర్థించారు.