హైదరాబాద్, జూలై18 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండలంలోని లక్ష్మీపూర్ బీసీ గురుకుల బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు నమోదైంది.
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.