మన్సూరాబాద్, జూలై 29: లంబాడాలను ఎస్జీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో చర్చలు జరిపి తమను అవమానించిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుపై శనివారం ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డికి తెలంగాణ స్టేట్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే గాంధీనాయక్, ఎల్బీనగర్ ఎస్టీసెల్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆర్ చందునాయక్ ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.