హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): జిల్లా పరిషత్‌లలో పని చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేని డిమాండ్ చేశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించాలని కోరారు. 2016లో దరఖాస్తు చేసుకున్న వారికి సైతం ఉద్యోగాలివ్వలేదని, వీరికి జిల్లా పరిషత్ వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. బాధితులు గురువారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో అసొసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, నాయకులతో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ) : టూరిజం సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సి ంగ్ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గురువారం సీఎం నివాసంలో ఎమ్మెల్యే సాంబశివరావుతో కలిసి యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజమౌళి వినతిపత్రాన్ని సమర్పించారు.