Telangana | కృష్ణకాలనీ, సెప్టెంబర్ 25: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘సామాన్యుడికో నీతి.. కాంగ్రెస్ నేతకో రీతి’ అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణమని ఒకరిది కూల్చేసిన అధికారులు అధికార పార్టీ నేత నిర్మాణం జోలికి వెళ్లడం లేదు. వివరాల్లోకి వెళ్తే.. భూపాలపల్లి పట్టణంలోని జాతీయ రహదారికి పకనే గల 170 సర్వే నంబర్లో కొంతమంది అసైన్డ్ భూమిలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మాణం చేపట్టారు.
విషయం తెలుసుకున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అకడికి వచ్చి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని కూల్చివేశారు. 1975లోనే అప్పటి ప్రభుత్వం తమకు పట్టా పాస్ బుక్ ఇచ్చిందని, ఇప్పటి సర్కారు దళితుల భూములను బలవంతంగా గుంజుకునే ప్రయత్నం చేస్తున్నదని షెడ్డు నిర్మించిన వ్యక్తి మోరె వెంకటయ్య వాపోయాడు. అదే 170 సర్వే నంబర్లో 20 గుంటల ఆసైన్డ్ భూమి లో ఓ అధికార పార్టీ నేత పాగావేసి ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అందులో ద ర్జాగా రేకుల షెడ్లు నిర్మించాడు.
దళితుల ని ర్మాణాలు అక్రమమైనప్పుడు, అధికార కాం గ్రెస్ నేత వేసిన రేకుల షెడ్డు అక్రమ నిర్మాణం కాదా ? అనే సందేహాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. 170 సర్వే నంబర్లో గల అసైన్డ్ భూమిలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించామని తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. మరో అక్రమ నిర్మాణంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 25 : మహబూబ్నగర్ మున్సిపాలిటీలో చెరువులు, కుంటలు, నాలాలు, ఆయకట్టు ప్రాంతాల్లో ఇండ్లను నిర్మించుకున్న 70మందికి నోటీసులు జారీ చేసినట్టు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ, నీటిపారుదలశాఖ అధికారులు సంయుక్తంగా చేపట్టిన సర్వే ఆధారంగా నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉండే ఇండ్లకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఇండ్ల యజమానులు ఇంటి నిర్మాణాలకు సంబంధించి నీటిపారుదల శాఖ ఇచ్చిన ఎన్వోసీ, మున్సిపల్ అనుమతుల డాక్యుమెంట్లు వారం రోజుల్లో సమర్పించాలని కోరినట్టు వెల్లడించారు.