నాగర్ కర్నూల్ : మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న రఘుకుమార్ అనే డ్రైవర్ ( Driver Raghukumar ) ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి గ్రామానికి చెందిన రఘుకుమార్ బుధవారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్లో ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt ) ప్రయత్నించారు.
రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోగా విద్యుత్ షాక్ గురై కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి . స్థానికులు గమనించి 108 సమాచారం అందించడంతో అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు.