హైదరాబాద్, సెప్టెంబర్22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని గురుకుల సొసైటీల నిర్వహణ కోసం కామన్ డైరెక్టరేట్‌ను ఏర్పాటుచేయాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్ (టీజీపీఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్‌కుమార్ సూచించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన టీజీపీఏ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గురుకులాల్లో నెలకొన్న సమస్యలు, పరిష్కారాలపై చర్చించారు. గురుకుల సొసైటీలలో ఏకరూప పనివేళలు, పనివిధానం అమలుచేయాలని అజయ్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెస్ చార్జీలను పెంచాలని కోరారు. అనంతరం మైనారిటీ విభాగం రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నిమ్మల జితేందర్, ప్రధాన కార్యదర్శిగా రంగు స్వప్న, వైస్ ప్రెసిడెంట్ వెంకటయ్య, జ్యోతి, వరింగ్ ప్రెసిడెంట్ బండ శ్రీనివాసులు, కోశాధికారి వస్కుల రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్, కార్యదర్శిగా జహిరున్నీసా, సంయుక్త కార్యదర్శి రమేశ్, మహిళా విభాగం ప్రెసిడెంట్‌గా సుధారాణి, సెక్రటరీ మోనికా సోని, సలహాదారులుగా చందర్‌రెడ్డి, కల్పన, అధికార ప్రతినిధిగా బాలకృష్ణ ఎన్నికయ్యారు. టీజీపీఏ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ రాంబాబు, కోశాధికారి రాజేశం, వరింగ్ ప్రెసిడెంట్ పైళ్ల ప్రకాశ్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ భిక్షపతి, నీరజ తిరుపతి పాల్గొన్నారు.
ములుగురూరల్, సెప్టెంబర్ 22: వివాహం అనంతరం కుమారులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే స్థిరాస్తులను జప్తు చేస్తామని ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వారసత్వంగా ఆస్తిని అక్రమంగా పట్టా చేసుకొని వ్యవసాయం చేస్తున్న వారిపై 1977 చట్టాన్ని అమలు చేస్తూ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన మామిడిశెట్టి చిన్న మల్లయ్యకు ఇద్దరు కుమారులు ఉండగా, మల్లయ్యకు సంబంధించిన వ్యవసాయ భూ మిని కొడుకులు అక్రమంగా ప ట్టా చేసుకొని తల్లిందండ్రులను పట్టించుకోలేదు. దీంతో తండ్రి మల్లయ్య రెవెన్యూ అధికారులను సంప్రదించారు. భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నట్టు అధికారుల విచారణలో తేలడం తో 1977 చట్టం ప్రకారం భూమి తిరిగి మల్లయ్యకు చెందేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతోపాటు 2007 సీనియర్ పౌరుల పోషణ చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణభారం తీసుకోవాలని అతని కుమారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.