7 వర్సిటీలకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్
రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. దాంతో డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల గందరగోళానికి తెరదించినైట్టెంది.
- విడుదల చేసిన ఆర్ లింబాద్రి
- డిగ్రీ, పీజీ తరగతులు,ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్,సెమిస్టర్ పరీక్షలకు ఒకే షెడ్యూల్
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలకు కామన్ అకడమిక్ క్యాలెండర్‌ను రూపొందించారు. దాంతో డిగ్రీ, పీజీ కోర్సుల తరగతులు, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షల గందరగోళానికి తెరదించినైట్టెంది. పీజీలోని 1, 3 సెమిస్టర్లు, డిగ్రీలో మొదటి సెమిస్టర్లకు ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి బుధవారం విడుదల చేశారు. ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, తెలంగాణ, తెలంగాణ మహిళా వర్సిటీల్లోని డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులు, పీజీలో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంసీఏ, బీఎల్ఐసీ, ఎంపీఈడీ తదితర కోర్సులను క్యాలెండర్ ప్రకారం నిర్వహించుకోవచ్చు. ఒకేసారి తరగతులు ప్రారంభించి, ఇంటర్నల్స్, సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తారు. ఇదివరకు వర్సిటీలకు వేర్వేరుగా అకడమిక్ క్యాలెండర్లు అమలు చేస్తు ండగా, ప్రవేశ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటనలో సమస్యలు ఉత్పన్నమయ్యేవి.
ఉపయోగాలు
- ఏ కోర్సు ఎప్పుడు ప్రారంభమవుతున్నదో.. ఎప్పుడు ముగుస్తున్నదో స్పష్టత వస్తుంది. సిలబస్‌ను సకాలంలో ముగించొచ్చు.
- కోర్సుల నిర్వహణ అంతా ప్రణాళికాబద్ధంగా నడుస్తుంది.
- అమెరికా సహా విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లేవారికి సర్టిఫికెట్లు సకాలంలో అందుతాయి.
- వర్సిటీలకు పరీక్షలు, ఇంటర్నల్స్ ప్రాక్టికల్స్ షెడ్యూళ్లను రూపొందించే శ్రమ తగ్గుతుంది.
- ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీలో పై చదువుల కోసం వెళ్లేవారికి.. మధ్యలో నిష్క్రమించే వారికి విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడవచ్చు. సమయం ఆదా అవుతుంది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

