వైద్యశాఖలో అవినీతిపై విచారణకు కమిటీలు
డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) కార్యాలయంలో ఇటీవల వెలుగుచూసిన వరుస అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది. ఈ బాధ్యతలను ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణకు అప్పగించింది.
- ‘డీహెచ్‌లో షాడోల హల్చల్’ కథనానికి సర్కార్‌లో చలనం
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : డైరెక్టర్ ఆఫ్ హెల్త్(డీహెచ్) కార్యాలయంలో ఇటీవల వెలుగుచూసిన వరుస అవినీతి ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కమిటీలు వేసింది. ఈ బాధ్యతలను ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణకు అప్పగించింది. ఈ నెల 6న నమస్తే తెలంగాణలో ‘డీహెచ్‌లో షాడోల హల్చల్!’ పేరిట ఆ శాఖలో విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేసేందుకు ఓ అధికారి లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఓ కథనం ప్రచురితమైంది. దీంతోపాటు గురువారం ‘వైద్యశాఖలో వసూళ్ల మహమ్మారి!’ పేరిట అడిషనల్ డైరెక్టర్ సహా మరో ఇద్దరు అధికారులు స్టాఫ్ నర్సు, అటెండర్ పోస్టులకు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని రూ.19.50 లక్షలు వసూలు చేసిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. మరోవైపు అడిషనల్ డైరెక్టర్ సహా మరో ఇద్దరు ఉద్యోగులపై క్రిమినల్ కేసు నమోదైన విషయాన్ని ఈ ఏడాది జనవరిలో ఆ శాఖ కీలకాధికారికి దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలుపకుండా సదరు కీలకాధికారి గోప్యత పాటించినట్టు తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

