హైదరాబాద్, నవంబర్ 13(నమస్తే తెలంగాణ): క్రిస్మస్ వేడుకల నిర్వహణపై రాష్ట్రస్థాయి కమిటీతో పాటు ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే వేడుకలకు సంబంధించి కమిటీలు త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు. కిస్మస్ పురసరించుకొని ప్రజా ప్రభుత్వం నిర్వహించనున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు నిర్వహణ, కమిటీలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. జీహెచ్ఎంసీలో కూడా వేడుకల నిర్వహణకు కమిటీలు వేయాలని చెప్పారు. సమావేశంలో మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తాప్సీద్ ఇక్బాల్, మైనార్టీ వెల్ఫేర్ కమిషనర్ యాస్మిన్, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ సబిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాసర్ పాల్గొన్నారు.