హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : పీఎం కుసుమ్ పథకంలో మహిళా సంఘాలకు కేటాయించిన సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కలెక్టర్ల నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నలుగురు అధికారులతో డిస్ట్రిక్ట్ లెవల్ ఎగ్జిగ్యూషన్ కమిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీచేసింది.
కలెక్టర్ చైర్మన్‌గా, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, డిస్కంల సూపరింటెండెంట్ ఇంజినీర్, రెడ్కో జిల్లా మేనేజర్ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసింది.