హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): నేరాల పరిశోధనలో నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని డీజీపీ అంజనీకుమార్ సూచించారు. సీఐడీ విభాగంలోకి కొత్తగా వచ్చిన 42 మంది అధికారులకు ఐదు రోజుల ఓరియంటేషన్‌ను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. నేరాల పరిశోధన, కొత్త తరహా నేరాల అధ్యయనంలో తెలంగాణ సీఐడీ విభాగం కీలకపాత్ర పోషిస్తున్నదని, ఆ ధోరణిని, కొత్త ఒరవడిని అందుకోవాలని చెప్పారు. టీమ్‌వర్క్‌తో వృత్తికి వన్నె తీసుకురావాలని కోరారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.