హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా మం త్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన ఎలక్షన్ పిటిషన్లో సాక్షులను విచా రించేందుకు హైకోర్టు అడ్వకేట్ కమిషన్‌ను ఏ ర్పాటు చేసింది. ఈ నెల 11 నాటికి కమిషన్ విచారణ పూర్తిచేసి, నివేదిక సమర్పించాలని జస్టిస్ ఎం లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 6న మహబూబ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్, రాణిగంజ్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్, ఎరగ్రడ్డ ఎస్బీఐ మేనేజర్, మహబూబ్‌నగర్ జిల్లా బండమేడి ఆర్టీవో.. 8న మెదక్ జిల్లా ఆర్డీవో.. 11న నల్లగొండ జిల్లా అదనపు కలెక్టర్ల సాక్ష్యాలను నమోదు చేయాలని పేర్కొన్నారు. ఈ మేరకు సాక్షులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. సాక్షుల నుంచి సేకరించిన వివరాలను ఈ నెల 12న హైకోర్టుకు నివేదించాలని స్పష్టం చేశారు.