హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): న్యాయ వివాదాల్లో చిక్కుకున్న మొండి బకాయిల వసూలుకు వాణిజ్య పన్నుల శాఖ బంపరాఫర్ ప్రకటించింది. దాదాపు రూ.3 వేల కోట్ల మేర పన్నులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులు, ట్రిబ్యునళ్ల వద్ద ఉన్నాయి. కేసుల్లో తీర్పులు వచ్చి, డబ్బు రికవరీ చేయడం కష్టసాధ్యమని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ను ప్రకటించింది. బకాయిలపై భారీగా రాయితీలు ప్రకటించింది. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బీహార్, పశ్చిమబెంగాల్లో ఇలాంటి పథకం అమల్లో ఉన్నది. వీటిని అనుసరిస్తూ ప్రభుత్వం ‘తెలంగాణ స్టేట్ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్-2022’ను ప్రకటించింది. రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ డీలర్లందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొన్నది.
వివాదాస్పద పన్నులపై ఆఫర్లు ఇవే..
దరఖాస్తు విధానం ఇలా..