అప్పుడెప్పుడో వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మూవీ చూసే ఉంటారుగా. అందులో ఉపేంద్ర యాక్ట్ చేసిన దేవరాజు పాత్ర ఓ డైలాగ్ చెబుతుంది. ‘ఇన్నాళ్లు నా భార్యకు కనిపించకుండా దాచిన జంతువు బోను బద్దలు కొట్టుకు వస్తే ఎలా ఉంటుందో చూస్తావా’ అంటాడు. మనందరి చుట్టూ కూడా అలాంటి బోను ఒకటి ఉంటుంది. ఇది కంటికి కనిపించదు గానీ,మన ఆలోచనలను, మన సామర్థ్యంపై నమ్మకాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదే కంఫర్ట్ జోన్. ఇందులోంచి బయటికి రానంత కాలం.. జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. ఈ బోనుని ఎలా బద్దలు కొట్టాలో తెలుసుకుందాం.
ఎందుకు బయటికి రావాలి?
ప్రయాణం ఇలా..
కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్ చేరుకున్నప్పుడే కలలను సాకారం చేసుకోగలరు. అంచెలంచెలుగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో నాలుగు ముఖ్యమైన జోన్స్ ఉంటాయి.
1. కంఫర్ట్ జోన్: ఇది ప్రశాంతంగా, సుఖంగా ఉండే మండలం. ఇక్కడ ప్రతిదీ సులభంగా అనిపిస్తుంది. ఇది మన పురోగతిని ఆపేస్తుంది.
2. ఫియర్ జోన్: కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాగానే ఎదురయ్యే మొదటి జోన్ ఇదే. ఇక్కడ మీకు ఆత్మవిశ్వాసం తక్కువగా అనిపిస్తుంది, నేను చేయగలనా? అనే సందేహం కలుగుతుంది. పరాజయం, ఇతరులు ఏమనుకుంటారోననే భయం వెంటాడుతుంది. ఇది మార్పును నిరోధించే జోన్.
దాటే మార్గం: మీ భయాన్ని గుర్తించండి, ఆ భయంతో కూడా చిన్న అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి.
3. లెర్నింగ్ జోన్: ఇది సవాళ్లను స్వీకరించి, వాటి నుంచి అభ్యాసం చేసే జోన్. భయాన్ని దాటి ముందుకు వచ్చిన తర్వాత, కొత్త నైపుణ్యాలను, పద్ధతులను నేర్చుకోవడం ఇక్కడ మొదలవుతుంది.
దాటే మార్గం: సానుకూల దృక్పథం కలిగి ఉండండి. తప్పులు చేయడం సహజమని అంగీకరించండి. ప్రతి తప్పు ఒక గుణపాఠం అని భావించండి.
4. గ్రోత్ జోన్:ఇది లక్ష్యాలను చేరుకునే అంతిమ జోన్. అభ్యాసం ద్వారా సంపాదించిన నైపుణ్యాలతో మీరు మీ పూర్తి సామర్థ్యాన్ని ఇక్కడ తెలుసుకోగలరు.
ఇక్కడ చేయాల్సినవి: కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవడం, మీరు నేర్చుకున్న విషయాలను అమలు చేయడం, ఇతరులను ప్రేరేపించడం.
బయటికి ఎలా రావాలి?
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం కష్టమేమో గానీ అసాధ్యమైతే కాదు. ఆలోచనా విధానం, చేసే పనుల్లో కొద్దిపాటి మార్పులు తీసుకు వస్తే కంఫర్ట్ జోన్ నుంచి గ్రోత్ జోన్‌కి సులభంగానే చేరుకోవచ్చు.
కంఫర్ట్ జోన్ నుండి గ్రోత్ జోన్‌కి మారడం అనేది జీవితకాలపు ప్రయాణం. మీరు ఎంత తరచుగా కొత్త సవాళ్లను స్వీకరిస్తే, మీ వృద్ధి అంత వేగంగా ఉంటుంది. నిన్నటి మీ కంఫర్ట్ జోన్ రేపటి విజయానికి పునాదిగా మారుతుంది.
-బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261