హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తమ రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను సందర్శించేందుకు రావాలని కర్ణాటక మైనర్ ఇరిగేషన్ మంత్రి బోసురాజు తెలంగాణ రైతు కమిషన్‌ను ఆహ్వానించారు. మంగళవారం బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రితో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు భవానీరెడ్డి భేటీ అయ్యా రు. ఇరు రాష్ర్టాలకు చెందిన మైనర్, మేజర్ ఇరిగేషన్లపై వీరు చర్చించారు. ఒక నివేదికను తయారు చేసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఇచ్చిన ట్టు కోదండరెడ్డి తెలిపారు. స్పందించిన బోసురాజు తాను త్వరలో ఉత్తమ్‌కుమార్ రెడ్డిని కలిసి ఈ అంశంపై చర్చిస్తానని పేర్కొన్నారు.