హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): జూన్ 6న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాలని బీఆర్ఎస్ మలేషియా శాఖ ప్రతినిధులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కోరారు. బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో మలేషియాశాఖ ప్రతినిధులు మారుతి కుర్మా, చిట్టిబాబు, శ్రీధర్, ప్రియా తదితరులు గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసినరు.
వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆహ్వాన లేఖ అందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొన్నారు.