హైదరాబాద్, సెప్టెంబర్8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో 20న కలెక్టరేట్ల ము ట్టడి చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యుడు, జా తీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృ తం చేస్తామని హెచ్చరించారు. ఆదివారం కాంగ్రెస్ లోక్‌సభపక్ష నాయకుడు రాహుల్‌గాంధీకి, ఆర్ కృష్ణయ్య రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో తక్షణం కులగణన నిర్వహించాలని, బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని డి మాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేష న్లు కల్పిస్తామని రాహుల్‌గాంధీ నిత్యం డి మాండ్ చేస్తున్నారని తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. బీసీ నేతలు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే అణిచివేస్తున్నదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50 శాతం సీలింగ్ అని చెప్పి తప్పించుకునేందుకు వీలులేదని స్పష్టం చేశారు.