రెంజల్. ఆగస్టు 9: అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్‌కు వచ్చి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం రూ.లక్షన్నర లోపు పంట రుణాలను మాఫీ చేయగా.. కెనరా బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యంతో మాఫీ వర్తించలేదని వాపోయారు. స్పందించిన కలెక్టర్ మాఫీ కాని రైతుల జాబితాను రెండ్రోజుల్లో సమర్పించాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు.
బీసీ యువతకు ఉపాధి శిక్షణ
హైదరాబాద్, ఆగస్టు9 (నమస్తే తెలంగాణ): బీసీ నిరుద్యోగ యువతకు ఎల్జీ హోప్ టెక్నికల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 100మంది అభ్యర్థులను ఎంపిక చేసి 3నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. రూ.4వేల ఉపకారవేతనం అందిస్తామని తెలిపారు. 24 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల ని, వివరాలకు 040-24071178 నం బర్లో సంప్రదించాలని సూచించారు.