గద్వాల, జూన్ 18 : జోగుళాంబ గద్వాల కలెక్టర్గా గతంలో పనిచేసిన వల్లూరు క్రాంతి అవినీతిపై విచారణ చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు డి మాండ్ చేశారు. మంగళవారం పీసీసీ అధికార ప్రతినిధి షెక్షావలి ఆచారి, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డితోపాటు పలువురు కలెక్టర్ సంతోష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల కలెక్టర్గా పనిచేసిన క్రాంతి జిల్లాలో పలు భూ రికార్డులు మార్చి ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపించారు. విచారణ చేపడితే ఆమె అవినీతి, అక్రమాలు బయటపడే అవకాశం ఉన్నదని వారు సూచించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో కాంగ్రెస్ నాయకులు మద్దిలేటి, ఇసాక్, గణేశ్, వెంకటేశ్, ఫిరోజ్ తదితరులు ఉన్నారు.