ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్ శివారులో రైతు పండుగ పేరిట నిర్వహించిన సంబురాల్లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయినికి అవమానం జరిగింది. మంత్రులు తుమ్మల, రాజనరసింహ, జూపల్లితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతోపాటు కాంగ్రెస్ నాయకులూ హాజరయ్యారు.
వారంతా వేదికపై కుర్చీల్లో కూర్చుండగా.. కలెక్టర్‌ను మాత్రం వేదికపైకి పిలిచి కుర్చీ ఇవ్వకుండా ఇలా నిలబెట్టారు.