హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): వీఆర్ఏల క్రమబద్ధీకరణ దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. సీసీఎల్ఏ ఓ వైపు వీఆర్ఏల సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏల వివరాలను సమగ్రంగా సేకరించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలకు 47 కాలమ్స్‌తో కూడిన కొత్త ఫార్మాట్‌ను పంపించారు. ఉద్యోగంలో చేరిన రకం, కులం, వయస్సు, విద్యార్హతలవారీగా వివరాలను సేకరిస్తున్నారు. వీటిని మూడు రోజుల్లోగా సేకరించి పంపించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు.